Tuesday, June 16, 2020

Art of parenting




👨‍👩‍👧‍👦 తలిదండ్రులు ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు, ఆత్మవిమర్శ చేసుకోవలసిన సమయం

⁉ కొడుకు ప్రాజెక్టు వర్క్ కోసం ఆపీసు నుంచి ప్రింట్లు తీసుకొచ్చే తండ్రి పరోక్షంగా అతనికి ఏం నేర్పిస్తున్నాడు?

⁉ నచ్చిన చీర కొనుక్కుని ఆ విషయం భర్తకు చెప్పొద్దని చెప్పే తల్లి ఆ కూతురుకి ఏం నేర్పిస్తుంది?

⁉ పిల్లల ఎదురుగా భర్త లేదా భార్యతో గొడవపడటం ద్వారా మీరేం నేర్పిస్తున్నారు?

⁉ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు నవ్వుతూ ఆహ్వానించి, వారు వెళ్లిపోగానే విమర్శించే మీనుంచి పిల్లలు ఏం నేర్చుకుంటారో తెలుసా?

⁉ లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిని తల్లిపై బిడ్డలకు ఏం గౌరవం ఉంటుంది?

⁉ పిల్లలు చదువుతుండగా మీరు టీవీ చూస్తుంటే వారిపట్ల మీకేం శ్రద్ధ ఉన్నట్లు?

⁉ పిల్లల్ని కూర్చోబెట్టుకుని జబర్దస్త్ లాంటి షోలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే విలువలు ఎక్కడినుంచి వస్తాయి?

⁉ మార్కులు, ర్యాంకుల గురించి కాకుండా ఇతర విషయాల గురించి మీరెప్పుడైనా మాట్లాడారా? వారి ఇష్టాయిష్టాలేమిటో తెలుసుకున్నారా? అసలు వారికిష్టమైన కోర్సు చదవనిచ్చారా?

⁉ చదువుల పేరుతో లక్షలకు లక్షలు ఖర్చుచేస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన తీరులో ఆలోచించడం నేర్పిస్తున్నారా? దానికోసం రూపాయైనా ఖర్చు చేస్తున్నారా?

⁉ అసలు పిల్లల్ని ఎలా పెంచాలో మీకు తెలుసా? అందుకోసం కనీసం ఒక్క పుస్తకమైనా కొని చదివారా? ఒక్క వీడియో అయినా చూశారా? ఒక్క క్లాసయినా విన్నారా?

⁉ అవసరానికి, ఆడంబరానికి మధ్య ఉన్న తేడా మీ పిల్లలకు తెలిసేలా చేశారా?

⁉ సరదాకు, విచ్చలవిడితనానికి తేడా ఏమిటో వివరించారా?

⁉ వారి జీవితానికి వారే బాధ్యులని ఎన్నడైనా చెప్పారా?

⁉ మీ పిల్లలు చెడిపోవడానికి మీడియా, సోషల్ మీడియా, టెక్నాలజీనే కారణమని తిడుతూ మీరు మీ బాధ్యతనుంచి తప్పించుకుంటున్నారని ఎన్నడైనా గుర్తించారా?మీ పిల్లలు మిమ్మల్ని నిరంతరం గమనిస్తుంటారని, మిమ్మల్నే అనుసరిస్తారని, వారిపై అన్నింటికంటే మీ ప్రభావమే ఎక్కువని తెలుసుకోండి.అన్నిటికీ సమాజాన్ని తిట్టడం మానేసి మార్పు మీనుంచి, మీ ఇంటినుంచి మొదలుపెట్టండి.

PARENTING IS AN ART and SCIENCE.

Please learn it and gift a beautiful future to your child.

No comments:

Post a Comment