Saturday, September 5, 2020

జలుబు, దగ్గుకు దివ్యౌషధం.. తమలపాకు కషాయం..

 జలుబు, దగ్గుకు దివ్యౌషధం.. తమలపాకు కషాయం..

తమలపాకు కాడలను ఉప్పు వేసి దంచి రాసుకుంటే ఒంటి నొప్పులు వెంటనే అరికడుతుంది. తలనొప్పి, చిగుళ్లనొప్పి, కీళ్ళనొప్పులకు తమలపాకు వాడితే ఉపశమనం లభిస్తుంది. అధిక రక్తస్రావాన్ని అరికడుతుంది. తమలపాకు, వక్క కలిపి తింటే దగ్గు, ఆస్తమా తగ్గిస్తుంది.
జలుబు, దగ్గుతో చాలా కాలం నుంచి బాధపడుతుంటే రెండు కప్పుల నీళ్ళు వేడిచేసి అందులో 8 తమలపాకులు వేసి మరగపెట్టి ఒక కప్పు కషాయం తయారయ్యాక సేవించాలి. ఇలా చేస్తే జలుబు, దగ్గు, నయమౌతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

తమలపాకులో పలు పోషకాలున్నాయి. కెరోటినాయిడ్స్‌, ఇనుము, క్యాల్షియం, విటమిన్‌ సి, విటమిన్‌ బి, జింక్‌లు సమృద్ధిగా ఉన్నాయి. కొద్ది మోతాదులో ప్రొటీన్‌ కూడా ఉంది.
భోజనం తరువాత తమలపాకులు తింటే జీర్ణశక్తి పెరుగుతుంది.

మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. నోటి దుర్వాసనను పోగొడుతుంది. ఐరన్‌, క్యాల్షియం ఉండడం వల్ల గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు మేలు చేస్తుంది. వక్క, పొగాకు లేకుండా ఆరోగ్యకరమైన పాన్‌ను తయారుచేసుకుంటే, తినడానికి రుచిగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.